Adnan Sami

Neeve Neeve

నిను చూసిన ఆ నిమిషాన
తెలియని కలవరం
కనుమూసిన కళ్లలోన
చెరగని అనుభవం
ఒక ముల్లల్లే నన్నే గిల్లావే
మల్లెపువ్వల్లే నన్నే తడిమావే
మెల్లగా మార్చేశావే
ఈ ఆనందం అర్థం నువ్వే...
నీవే నీవే నీవే... నీవే నీవే నీవే...
॥చూసిన ॥
హో... ఎదలో ఇంకోవైపు చూశావే ఓ చూపు
ఒకసారి రా నా వైపు
హో... కన్నులో కాసేపు కలిగిందో కైపు
పడిపోయా నేనే దాదాపు
కదిలేట్టుగా లేదు ఈ కాలమే
కాసేపైనా నాతో రావే
క్షణం నీకు నే నచ్చినా
నీవే నీవే నీవే... నీవే నీవే నీవే... (2)
హో... చూసి చూడంగానే నే తేలిపోయా
ఏం మాయ నీలో ఉందే
హో... నవ్వే కొద్దీ నచ్చీ నువ్వంటే పిచ్చీ
పట్టింది ప్రేమే అంటావే
ఒడిలో నువ్వే నాలో ఒదిగుండవే
నీడైనా నీకు నేనేలే
నువు నా సొంతమవ్వాలిలే...
నీవే నీవే నీవే... నీవే నీవే నీవే... (2)
Stream naživo